ముంబయి : అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ముడి చమురు బ్యారెల్ ధర 91.31 డాలర్ల వద్ద కొనసాగుతుండటం, దేశీయ దిగుమతులపై తీవ్ర భారం పడుతుందనే ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ పరిణామాల ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చవి చూశాయి. ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 307.24 పాయింట్లు కోల్పోయి 76,957.27 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 50 కూడా 95.25 పాయింట్లు క్షీణించి 24,080కు పరిమితమయ్యింది.అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఈ ఇంధన అస్థిరతలు, ప్రతికూల ప్రపంచ సంకేతాల కారణంగా ప్రధాన రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఐటి, మెటల్, రియల్టీ, మీడియా షేర్లు భారీగా నష్టపోయి మార్కెట్‌ను పడగొట్టాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ వంటి దిగ్గజ షేర్లు అధిక నష్టాలను చవి చూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.24 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ సూచీ 0.74 శాతం నష్టపోయింది. ఆటో, ప్రయివేటు బ్యాంకింగ్ రంగాలు మినహా మిగిలిన అన్ని ప్రధాన విభాగాలు నష్టాలను ఎదుర్కొన్నాయి.
మార్కెట్లలో చమురు భయాలు: నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 12:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)