బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition95 డాలర్లకు చమురు ధరలు..

4 గంటల క్రితం

crude-oil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​వాషింగ్టన్‌ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95 డాలర్ల మార్కును దాటగా, గత ఆరు వారాల్లో ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మరోవైపు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (డబ్ల్యుటిఐ) క్రూడ్ ధర కూడా 88 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయ్యింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు సౌదీకి చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడంతో ఆయిల్ ట్యాంకర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియా నుంచి ముడి చమురు సరఫరాపై అంతరాయం ఏర్పడే అవకాశాలు పెరిగాయి. చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్