సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

''చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు ప్రశంసలు

1 గంట క్రితం

love story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 10:29 అపరాహ్నం | 5 నిమిషాల చదవడం

- కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి కల్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఎస్ కేఎన్. టాక్సీవాలా, బేబి వంటి చిత్రాలు ప్రొడ్యూసర్ గా ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలుస్తాయి. రాజీ పడకుండా కథ కోరుకున్నవన్నీ సమకూర్చి సినిమా నిర్మించడమే కాదు ఆ చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడంలో వినూత్నంగా ఆలోచిస్తుంటారు ఎస్ కేఎన్. స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న ఈ రైజింగ్ ప్రొడ్యూసర్.. ఇప్పుడు "చెన్నై లవ్ స్టోరీ" సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 24న "చెన్నై లవ్ స్టోరీ" సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్.

- మన తెలుగు జంట చెన్నైలో నివసిస్తుంటారు. అందుకే చెన్నై లవ్ స్టోరీ అని సినిమా టైటిల్ పెట్టాం. బేబి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మేకర్స్ గా మాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఒక మంచి మూవీతోనే ఆడియెన్స్ ముందుకు రావాలని ఏడాది సమయం తీసుకున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ చెప్పిన ఈ కథ, కథనం బాగా నచ్చాయి. మా కాంబినేషన్ లోనే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం.

- ప్రస్తుతం మా సినిమా తెలుగు రిలీజ్ వర్క్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. తమిళ్ రిలీజ్ అదే వారం చేయాలా, ఒకట్రెండు వారాలు ఆగి చేయాలా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే తమిళంలో కొన్ని పెద్ద మూవీస్ రిలీజ్ కు వస్తున్నాయి.

- మేము అనుకున్న కథకు కిరణ్ అబ్బవరం వందశాతం న్యాయం చేశారు. ఆయన ఇప్పటిదాకా బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. మాస్ క్యారెక్టర్స్ లో నటించారు. కిరణ్ గారి నటనలోని ఒక మెచ్యూరిటీని ఈ సినిమాలో చూస్తారు. ఈ ఏడాది అన్ని అవార్డ్స్ లో కిరణ్ గారి పేరు నామినేషన్స్ లో ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా పేరు తెచ్చుకుని ప్రొడ్యూసర్ గా కొత్త వాళ్లను పరిచయం చేస్తూ అవకాశాలు ఇస్తున్నారు కిరణ్ గారు. ఆయన ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ ను ఈ సినిమా టైమ్ లో చూశాను.

- సాయి రాజేష్ గారి కథల్లో హీరోయిన్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుందని మీకు తెలుసు. ఈ సినిమా కథ అనుకున్నాక, ఇంత బలమైన పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది, ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని డిస్కషన్స్ చేశాం. సినిమా ప్రారంభమే హీరోయిన్ సీన్ తో మొదలవుతుంది. మేము తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నాం. శ్రీ గౌరి ప్రియను సెలెక్ట్ చేసుకున్నాం. ఆమె ఈ పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ఈ సినిమాలోని ఎమోషన్స్ చాలా రోజులు మనకు గుర్తుంటాయి.

- తొలిప్రేమ అయినా మలిప్రేమ అయినా మన జీవితంలో భాగమే. తొలి ప్రేమ దక్కని వారిలో మళ్లీ ప్రేమ పుట్టదని చెప్పలేం. ఏదైనా జీవితం ముందుకు సాగాల్సిందే. బేబి సినిమాను తొలి ప్రేమ నేపథ్యంగా నిర్మించాం. ఈ సినిమాలో మలి ప్రేమ కూడా గొప్పదే అని చెబుతున్నాం. మూవీలో విషాదకరంగా ఉండదు. బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్ల సమయం తీసుకుని మేము ఈ చిత్రాన్ని నిర్మించామంటే మాదైన ఒక మార్క్ ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు.

- మా సినిమాలో సముద్రం నేపథ్యంగా సాగే సీన్స్ ఏపీలోని చీరాల, వైజాగ్ బీచ్ లలో చేశాం. కొన్ని పాండిచ్చేరిలో చేశాం. చెన్నైలో లైట్ హౌస్ దగ్గర సీన్స్ చేయాల్సినప్పుడు అక్కడికే వెళ్లి చేశాం. చెన్నైలో తప్పక చేయాల్సిన సీన్స్ అన్నీ చెన్నైలోనే షూటింగ్ జరిపాం. మేము చెన్నై మెట్రోలో కూడా కొన్ని సీన్స్ చేశాం.

- కథను నమ్మి ఆ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి అనేది ప్రొడ్యూసర్ నిర్ణయం. ఇది ఎమోషన్స్ తో ఆకట్టుకోవాల్సిన కథ. ఆ ఎమోషన్స్ కోసం విజువల్ బ్యూటీ అవసరం. అందుకోసం నేచురల్ గా ఆ విజువల్స్ వచ్చేవరకు ఆగి షూటింగ్ చేశాం. వర్షం, సూర్యోదయం నేపథ్యంగా సాగే సీన్స్ కోసం సహజంగా వచ్చేలా వెయిట్ చేసి చేశాం. చెన్నై, పాండిచ్చేరి, వైజాగ్, చీరాల..ఇలా పలు లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. అందుకే షూటింగ్ డేస్ పెరిగాయి. సినిమాకు కావాల్సినంత రైట్ ఎమోషన్స్ వచ్చేలా ఔట్ పుట్ తీసుకున్నాం. ఇంకా కొన్ని తక్కువ డేస్ లో కూడా ఇదే క్వాలిటీతో సినిమా చేయొచ్చు. అదొక ఆర్ట్. ఆ ఆర్ట్ ను నేను ఇంకా నేర్చుకునే క్రమంలో ఉన్నాను.

- బేబి సినిమాకు కల్ట్ లవ్ స్టోరీ అని పేరొచ్చింది. ఈ సినిమాకు క్లాసిక్ లవ్ స్టోరీ అనే పేరొస్తుంది. ఈ కథ విన్న వెంటనే మణిశర్మ గారు మా మూవీ చేస్తానని ఒప్పుకున్నారు. ఆయన చేసిన పాటలు ఎంత బాగుంటాయో మనకు తెలుసు. ట్యూన్ ఆకట్టుకుంటూనే లిరిక్స్ అర్థమవుతాయి. ఈ సినిమాలో అనంత శ్రీరామ్ సింగిల్ కార్డ్ రాశారు. ప్రతి లిరిక్ అర్థమయ్యేలా పాటను ఎంజాయ్ చేయొచ్చు. కథలోని భావోద్వేగాలు తెలిసేలా మెచ్యూర్డ్ గా మ్యూజిక్ చేయడంలో తనకు తానే సాటి అని మణిశర్మ గారు మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

- డైరెక్టర్ రవి నంబూరి మాకు సోదరుడి లాంటి వారు. ఆయన మాతో ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నారు. మాకు వెబ్ సిరీస్ స్టోరీ ఇచ్చారు. బేబి మూవీకి వర్క్ చేశారు. ఆయనతో ఈ సినిమా నిర్మించడం హ్యాపీగా ఉంది. రవి టాలెంటెడ్ టెక్నీషియన్, డైలాగ్స్ బాగా రాస్తాడు. డైరెక్టర్ సాయి రాజేష్ , రవి నంబూరి కలిసి ట్రావెల్ చేస్తున్నారు, ఐడియాస్ షేర్ చేసుకుంటారు. సాయి రాజేష్ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించుకుంటారు. అందుకే ఆయనకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.

- సినిమా రిలీజైన శుక్రవారమే ఆ సినిమాది. బేబి రిలీజైన తర్వాత చాలా శుక్రవారాలు చాలా సినిమాలు వచ్చాయి. మేము కలర్ ఫొటో, బేబి మేకర్స్ అని నుంచి ఈ సినిమా వస్తోందని చెప్పాం కాబట్టి అది ప్రేక్షకుల్లో ఒక అంచనాలు క్రియేట్ చేసింది. మీడియా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి ప్రచారం కూడా ఇంటెన్స్ గా చేస్తున్నాం. ఊర్లలో కూడా మా సినిమా రిలీజ్ కోసం ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. ఆ ఇంపాక్ట్ మేము క్రియేట్ చేయగలిగాం. ఒక మంచి రిలీజ్ ను మా సినిమాకు ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది.

- అర్జున్ రెడ్డి, యానిమల్, బేబి ..ఇలాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ ఎప్పుడు వచ్చినా కొన్ని వివాదాలు వస్తుంటాయి. "చెన్నై లవ్ స్టోరీ"లో అలాంటి వివాదాస్పద కంటెంట్ ఉండదు. ఇది ఎక్కువగా ఎమోషనల్ డెప్త్ మీద వెళ్లే కథ.

- ఓటీటీలు సినిమాల రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేయడం అనేది జరుగుతోంది. అయితే వాళ్లు కొన్ని నెలల ముందే ప్రొడ్యూసర్ కు చెబుతారు. ఈ విషయంలో నాకు ఒత్తిడి ఎదురుకాలేదు. కొందరు ప్రొడ్యూసర్స్ తాము ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. మా "చెన్నై లవ్ స్టోరీ" మూవీ ఓటీటీ డీల్ కంప్లీట్ అయ్యింది. ఆ సంస్థనే ఆ విషయాన్ని ప్రకటిస్తుంది.

- సినిమాను రాజీ లేకుండా నిర్మించడమే మా చేతుల్లో ఉంది. ఆ సినిమాకు ప్రేక్షకులు ఎంత కలెక్షన్స్ ఇస్తారు అనేది తెలియదు. ఇప్పుడు ఇంత కలెక్ట్ చేస్తుందని నేను చెబితే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మా సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుంది. అందరి ప్రసంశలు పొందుతుంది. బేబి లాగే మాకు మంచి పేరు తీసుకొస్తుంది. మేకర్స్ గా మాకు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం.

- మా "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ మా సినిమాకు టార్గెట్. వాళ్లంతా వచ్చి మా సినిమాను అఫర్డబుల్ టికెట్ రేట్స్ లో చూడాలి. టికెట్ రేట్స్ పెంచి వచ్చే కలెక్షన్స్ కన్నా, ఎక్కువమంది ఆడియెన్స్ మా సినిమాను చూస్తున్నారనేది సంతోషాన్నిస్తుంది. ప్రస్తుతం కొన్నిఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. వాటిని త్వరలో అనౌన్స్ చేస్తాను.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్