- సెన్సెక్స్ 521 పాయింట్ల పెరుగుదల
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోయింది. సోమవారం భారత రూపాయి విలువ 20 పైసలు పడిపోయి 95.38 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్ బలపడటంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలపై ఒత్తిడి నెలకొనడం రూపాయి క్షీణతకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో 95.25 వద్ద ప్రారంభమైన రూపాయి.. ఇంట్రాడేలో 95.22 - 95.48 మధ్య కదలాడింది.
మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లలో ఆశావహ అంచనాలు నెలకొనడం మార్కెట్లకు ఊతమిచ్చాయి. ముఖ్యంగా ఆటో, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 521 పాయింట్లు లాభపడి 80,852 వద్ద ముగియగా, నిఫ్టీ 159.50 పాయింట్లు ఎగిసి 24,430 నమోదయ్యింది.








కామెంట్‌లు (0)