సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కైగా అణు విద్యుత్ ప్రాజెక్టులో ఎంఇఐఎల్ రికార్డు

2 గంటల క్రితం

mail
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 11:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- భారీ కాంక్రీట్ పోర్ పూర్తి

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : కర్నాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రం 5, 6 యూనిట్ల నిర్మాణంలో కీలక మైలురాయిని అధిగమించినట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్‌) వెల్లడించింది. అణు విద్యుత్ సంస్థ ఎన్‌‌పిసిఐఎల్‌ చరిత్రలోనే అతిపెద్ద మోనోలిథిక్ కాంక్రీట్ పోర్లలో ఒకటిగా నిలిచే ఈ భారీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. సుమారు 7,250 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను నిరంతరాయంగా పోసి తమ సాంకేతిక సామర్థ్యాన్ని చాటుకున్నట్లు వెల్లడించింది. మారుమూల ప్రాంతం, భారీ వర్షాల వంటి సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేక వర్ష రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కాంక్రీట్‌ను స్థిరంగా నిర్వహించేలా అధునాతన యంత్రాలను వినియోగించారు. అణు విద్యుత్ రంగంలో సంస్థ చేపట్టిన తొలి ప్రాజెక్టులోనే ఈ ఘనత సాధించడం విశేషమని.. ఇది ఎంఇఐఎల్ సాంకేతిక నిపుణతకు, క్రమశిక్షణకు నిదర్శనమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్