సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రిలయన్స్ కు సెబీ హెచ్చరిక

2 గంటల క్రితం

sebi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 11:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం

ముంబయి : ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మార్కెట్‌ ‌రెగ్యూలేటర్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పరిపాలనాపరమైన హెచ్చరిక జారీ చేసింది. కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు, ఒక ఉద్యోగి సన్నిహిత బంధువు కీలక సమాచారం బహిర్గతం కాకముందే రిలయన్స్ షేర్లలో లావాదేవీలు నిర్వహించినట్లు సెబీ గుర్తించింది. ఈ మేరకు జులై 6న రిలయన్స్‌ ‌లేఖను అందుకుంది. 2024 జూన్ 1 నుంచి ఆగస్టు 30 వరకు జరిగిన ‌షేర్ల లావాదేవీలపై నిర్వహించిన దర్యాప్తులో హర్ష్ జైన్, కామినీ జైన్, హిరై ఉమాంగ్ దోషి ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ తేల్చింది. ఈ లావాదేవీలు సెబీ చట్టంలోని సెక్షన్ 12ఎ (డి), (ఈ)తో పాటు 2015 నాటి ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలకు విరుద్ధమని సెబీ తెలిపింది. అదే విధంగా కంపెనీలో ఇలాంటి ఉల్లంఘనలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడంలో రిలయన్స్ యాజమాన్యం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సెబీ సమాచారం ఇచ్చిన తర్వాతే వాటిని గుర్తించిందని ఆక్షేపించింది. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కంప్లయన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కంపెనీ కంప్లయన్స్ అధికారిని హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరిక పరిపాలనాపరమైనదేనని.. దీని వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక లేదా కార్యకలాపపరమైన ఆంక్షలు ఉండవని రిలయన్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్