బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచమురు ధరలతో ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి

16 గంటల క్రితం

RBI Deputy Governor Poonam Gupta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 09:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ పూనమ్‌ గుప్తా

న్యూఢిల్లీ : ఇంధన దిగుమతులపై అధికంగా ఆధారపడటం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ముప్పుగా పరిణమిస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) డిప్యూటీ గవర్నర్‌ పూనమ్‌ గుప్తా హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం దేశ ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెంచుతాయని పేర్కొన్నారు. ఓ మీడియా కార్యక్రమంలో పూనమ్‌ ‌మాట్లాడుతూ.. ధరల పెరుగుదలతోపాటు అవసరమైన ఇంధనం సకాలంలో అందుబాటులో ఉండటం కూడా కీలక సవాలుగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, ఇంధన సరఫరా వనరులను విస్తరించడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడం అత్యవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రుణభారం పెరగడం, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా సంఘర్షణలు, తీవ్ర వాతావరణ మార్పులు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని పెంచుతున్నాయని పూనమ్‌ గుప్తా తెలిపారు. అమెరికా సుంకాలు, అధిక చమురు ధరలు, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహంలో మార్పులు భారత్‌కు అదనపు సవాళ్లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ పలు రంగాల్లో పటిష్టత సాధించినప్పటికీ, బాహ్య పరిణామాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలిక ఉపశమన చర్యలకే పరిమితం కాకుండా మధ్య, దీర్ఘకాలిక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్