బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

7,000mAh బ్యాటరీతో రియల్‌మీ 16ఎక్స్‌ 5జీ.. ధర ఎంతంటే?

3 గంటల క్రితం

realme 16x5g
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 09:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రారంభ ధర రూ.23,999

  • 6జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌..

రియల్‌మీ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్‌మీ 16ఎక్స్‌ 5జీ పేరుతో విడుదలైన ఈ మొబైల్‌లో భారీ 7,000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ లభిస్తుంది.

రియల్‌మీ 16ఎక్స్‌ 5జీ 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ బేస్‌ మోడల్‌ ధర రూ.25,999గా ఉంది. 6జీబీ + 128జీబీ వేరియంట్‌ రూ.27,999, 6జీబీ + 256జీబీ మోడల్‌ రూ.30,999 ధరకు లభిస్తుంది. ఎండ్యూరెన్స్‌ బ్రౌన్‌, గ్లోరీ వైట్‌ కలర్‌ ఆప్షన్లలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌ ప్రారంభం కానుంది.

తొలి విక్రయాల్లో భాగంగా రియల్‌మీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రూ.2,000 వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో పాటు గరిష్ఠంగా రూ.3,000 వరకు ఎక్స్ఛేంజ్‌ ప్రయోజనం పొందొచ్చు. డిస్కౌంట్‌ వర్తించిన తర్వాత ఫోన్‌ ప్రారంభ ధర రూ.23,999కు చేరుతుంది. కొనుగోలుదారులకు 10 నెలల వరకు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

ఫోన్‌లో 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ ఉంది. 144Hz రిఫ్రెష్‌ రేట్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో పాటు గరిష్ఠంగా 1,200 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే అందిస్తుంది. పనితీరు కోసం మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అమర్చారు. కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో 50ఎంపీ ప్రధాన కెమెరా, ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ విషయంలో రియల్‌మీ 16ఎక్స్‌ 5జీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో 7,000mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీని అందించారు. ఇది 45వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బైపాస్‌ ఛార్జింగ్‌, రివర్స్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మన్నికను దృష్టిలో పెట్టుకుని ఫోన్‌కు ఐపీ65 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఇచ్చారు. ఫొటోగ్రఫీ, వీడియో అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఏఐ ఎరేజర్‌, ఏఐ అల్ట్రా క్లారిటీ, మోషన్‌ ఫొటో, డ్యుయల్‌ వ్యూ వీడియో వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. భారీ బ్యాటరీతో పాటు హై రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే కావాలనుకునే వారికి రియల్‌మీ 16ఎక్స్‌ 5జీ ఆసక్తికరమైన ఎంపికగా నిలవనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్