న్యూఢిల్లీ: దేశంలో ధరలు కోరలు చాస్తోన్నాయి. జూన్‌లో 4.38 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. జులైలో 4.45 శాతానికి చేరింది. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలా పెరిగినట్లయింది. ఆర్‌బిఐ మధ్యకాలికంగా నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యం కంటే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. బుధవారం కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరల్లో చోటుచేసుకున్న మార్పులు మొత్తం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి. ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడంతో రాబోయే పరపతి విధాన సమీక్షల్లో వడ్డీ రేట్లపై ఆర్‌బిఐ మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగితే వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశాలు పరిమితం కావచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
జులైలో 4.45 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)