ప్రముఖ హీరో సిద్ధార్థ్ నటించిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' సిరీస్ వచ్చే నెల 7వ తేదీ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్ కానుంది. ఈ సిరీస్ ను 1999 లో కార్గిల్ యుద్దం నేపథ్యంలో తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సిరీస్ టీజర్ లో శత్రువులు దాక్కున్న మంచు కొండలపై భారత బలగాలు సాహసోపేతమైన పోరాటం జరిపినట్లుగా చూపించారు. ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సిద్ధార్థ్.. ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా నటించాడు. అలాగే జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఓని సేన్ దర్శకత్వం వహించారు. దీనిని మ్యాచ్‌బాక్స్ షాట్స్, ఫీల్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.







కామెంట్‌లు (0)