ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతొమ్మిది జిల్లాలకు పంటల బీమా భాగస్వామిగా టాటా ఎఐజి

2 రోజుల క్రితం

Tata-AIG-Insurance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 09:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​విజయవాడ : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమలుకు టాటా ఎఐజి జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బీమా భాగస్వామిగా ఎంపికైనట్లు ఆ సంస్థ తెలిపింది. అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, కోనసీమ, కృష్ణా, కర్నూలు, ఎన్‌టిఆర్‌, పార్వతీపురం మన్యం, నెల్లూరు జిల్లాల్లో పథకం అమలులో సంస్థ భాగస్వామ్యం కానున్నట్లు పేర్కొంది. ఆయా జిల్లాల్లోని పంట నష్టాలకు బీమా రక్షణ కల్పించనున్నట్లు వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, కీటకాలు, వ్యాధుల వల్ల తలెత్తే పంట నష్టాల నుంచి ఆర్థిక భద్రతను పొందేందుకు రైతులు బ్యాంకులు, సిఎస్‌‌సి కేంద్రాలు లేదా అధికారిక పిఎంఎఫ్‌‌బివై వెబ్‌సైట్ ద్వారా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలని కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్