- రూ. 25,000 వరకు భారం
న్యూఢిల్లీ : దేశంలోని దిగ్గజ వాహన కంపెనీలన్నీ తమ ధరలను వరుసగా పెంచుతున్నాయి. పశ్చిమాసియా ఘర్షణలు, రూపాయి పతనం, ముడి సరుకుల ధరల పెరుగుదలతో ఆ భారాన్ని వినియోగదారులపై మోపాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్ ధరలను పెంచగా అదే బాటలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టిఎంపివి) నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ముడిసరుకు, కమోడిటీ ఖర్చులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా తమ కార్లు, ఎస్‌యువి ధరలను సెప్టెంబర్ 1 నుండి రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ రెండింటిపై వర్తించే ఈ ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుందని తెలిపింది. తయారీ వ్యయ భారాన్ని కొంతవరకు మాత్రమే వినియోగదారులపైకి మారుస్తున్నామని కంపెనీ తెలిపింది. కాగా ఈ త్రైమాసికంలో టాటా మోటార్స్ కార్ల ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత జూన్‌లోనూ ధరలను 1.5 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే.








కామెంట్‌లు (0)