శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionట్రాక్టర్ల అమ్మకాలు మందగించొచ్చు : ఎంఅండ్‌ఎం అంచనా

1 రోజు క్రితం

tractor.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ముంబయి : మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షపాత లోటు, కరవు పరిస్థితుల ప్రభావంతో 2026–27లో దేశీయ ట్రాక్టర్ పరిశ్రమ వృద్ధి అంచనాలను మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తగ్గించింది. గతంలో ఐదు శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేయగా.. తాజాగా వృద్ధి లేకుండా నిలకడగా ఉండవచ్చని సవరించింది. వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, పంట దిగుబడుల ధరలను పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాలను మార్చినట్లు కంపెనీ సిఇఒ రాజేష్ జేజూరీకర్ తెలిపారు. నవంబర్ చివరి వరకు రబీ సీజన్ కొనుగోళ్ల సరళిని పరిశీలించిన తర్వాత తదుపరి అంచనాలను వెల్లడిస్తామని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్