మంగళవారం, 15 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.2 వేలు దాటితే బాదుడే..!

2 గంటల క్రితం

upi charges.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 12:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • యుపిఐ చెల్లింపులు భారం..

న్యూఢిల్లీ : ఇప్పటి వరకూ పూర్తి ఉచితంగా కొనసాగుతున్న యుపిఐ లావాదేవీలపై ఛార్జీలు విధించాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌పిసిఐ) నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఎన్‌‌పిసిఐ మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం మేర ఛార్జీలు విధిస్తారు. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. రూ.2,000 దాటిన ‌వ్యక్తి నుంచి వ్యాపారికి (పి2ఎం) చెల్లింపులపై మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయని ఎన్‌‌పిసిఐ తెలిపింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే (పి2పి) లావాదేవీలపై ఛార్జీలుండవు. యుపిఐ క్యూఆర్ కోడ్‌ల ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపారులకు ఈ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. అలాగే రూ.2,000 లోపు ఉండే అన్ని వ్యాపార చెల్లింపులు, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలు కూడా యథావిధిగా ఉచితంగానే జరగనున్నాయి. ఒకవేళ లావాదే వీల విలువ రూ.75 వేలు, లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే గరిష్టంగా రూ.300కు పరిమితం చేశారు. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలు, వ్యవసాయ ముడి సరుకులకు సంబంధించి రూ.2 వేలు దాటిన లావాదేవీలపై శాతం లెక్క కాకుండా కేవలం రూ.5 ఎండిఆర్ వసూలు చేస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్