బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వి-రిచ్‌ డోర్‌‌స్టెప్‌ పాల సరఫరా విస్తరణ

5 గంటల క్రితం

వి-రిచ్‌ డోర్‌‌స్టెప్‌ పాల సరఫరా విస్తరణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : నగరానికి చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్ వి-రిచ్ హైదరాబాద్‌ నలుమూలలా రోజువారీ గేదె పాల సబ్‌స్క్రిప్షన్ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తమ సొంత ఫామ్‌ల ద్వారా పశువుల సంరక్షణ నుంచి పాల సేకరణ వరకు ప్రత్యక్ష పర్యవేక్షణ వహిస్తూ ‘ఫామ్-టు-డోర్‌స్టెప్’ విధానంలో ఎటువంటి ప్రిజర్వేటివ్‌లు, రసాయనాలు లేకుండా హోమోజనైజ్ చేయని ఫుల్ క్రీమ్ (6 శాతం ఫ్యాట్), టోన్డ్ (3 శాతం ఫ్యాట్) వేరియంట్‌లను అందిస్తున్నామని పేర్కొంది. ఉత్పత్తి మూలం వద్దనే నాణ్యతకు పెద్దపీట వేస్తూ వినియోగదారుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని వి-రిచ్ వ్యవస్థాపకురాలు, సిఇఒ యోగిత జాహ్నవి తెలిపారు. వినియోగదారులు తమ మొబైల్ యాప్ ద్వారా డోర్‌స్టెప్ డెలివరీలను సులభంగా షెడ్యూల్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్