బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎల్‌ఐసి, ఇపిఎఫ్‌ఒ అన్‌క్లెయిమ్డ్ నిధులను మళ్లించము

4 గంటల క్రితం

lic_unclaimed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ : ఎల్‌ఐసి, ఇపిఎఫ్‌ఒ ఖాతాల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించే ప్రతిపాదనలేవీ లేవని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఐఆర్‌డిఎఐ నిబంధనల ప్రకారం పదేళ్లకు పైగా క్లెయిమ్ కాని బీమా నిధులను సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ చేస్తారని.. అయితే వాటిని ఇతర ప్రయోజనాలకు మళ్లించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. మార్చి 31 నాటికి ఎల్‌ఐసిలో రూ.7,318.50 కోట్ల అన్‌క్లెయిమ్డ్ నిధులు ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా ఇపిఎఫ్‌ఒ రూ.9,330.56 కోట్ల అన్‌క్లెయిమ్డ్ నిధులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ మొత్తాలను అసలు లబ్ధిదారులకు త్వరగా చేరవేసేందుకు రూ.1,000లోపు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆధార్ ధ్రువీకరిన కలిగిన ఖాతాల్లోకి నేరుగా జమ చేసే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్