ప్రజాశక్తి – వేపాడ : వేపాడ మండలం వావిలిపాడు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలులు తో పాటు ఉరుములు, మెరుపుల తో వర్షం కురిసింది. ఈదురు గాలులకు దార్ల నారాయణరావు ఇంటి వద్ద ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపడింది. చెట్లు కూడా విరిగి పడటంతో విద్యుత్ కు ఆటంకం ఏర్పడింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని మాజీ సర్పంచ్ బీల రాజేశ్వరి తెలిపారు.
ఈదురు గాలులకు విరిగిపడిన విద్యుత్ స్తంభం
10 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)