సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాశక్తి వార్తకు స్పందన - అనాథ మహిళ చేరదీత

2 గంటల క్రితం

Response to the Prajashakti news report
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 01:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పలమనేరు రోడ్డుపై దయనీయ స్థితిలో మహిళ


ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : పలమనేరులో ఆరు నెలలుగా ఓ అనాథ మహిళ దయనీయ పరిస్థితుల్లో రోడ్డుపైనే జీవిస్తోంది. నిలబడలేని, సరిగా నడవలేని స్థితిలో ఎండ, వాన, గాలిని లెక్క చేయకుండా కాలం గడుపుతోంది. ఎవరినీ ఏమీ అడగకుండా, దయతో ఇచ్చిన ఆహారం లేదా వస్తువులను మాత్రమే స్వీకరిస్తోంది. ఆమె పరిస్థితిని గమనించిన స్థానికులు స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించి ఆశ్రయం, వైద్యం, అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై నిన్న పలమనేరులో ప్రచురించబడిన ప్రజాశక్తి వార్తకు స్పందన లభించింది. సోమవారం మధ్యాహ్నం పలమనేరు నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ జాతీయ అధ్యక్షుడు మాదేశ్ బృందం ఆధ్వర్యంలో ఆ మహిళను చేరదీసి ఆటోలో తీసుకుని వెళ్లి, గుండు కొట్టించి, స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి, ఆహార అందించి సేవ చేసినందుకు మాదేశ్ బృందమును, పలమనేరు ప్రజాశక్తి విలేకరి డి.త్యాగరాజులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్