ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం అని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రమాదేవి హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ... అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రమాదేవి మాట్లాడుతూ .... అంగన్వాడీల వేతనాలు పెంచాలని, నవచేతన యాప్ ను రద్దు చేయాలని, బీఎల్ ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు నాయకులు కళ్లెం.వెంకటేశ్వరావు, ఆర్ సి పి రెడ్డి, సి హెచ్,జయరావు, టి.నరేష్ సంఘీభావం తెలిపిన ఈ ధర్నా లో జిల్లా నలుమూలల నుండి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వేలాది మంది పాల్గొన్నారు. ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి కె.సాంబశివరావు ఇచ్చిన హామీతో ధర్నా విరమించారు. తొలుత వినతి పత్రం ఇచ్చేందుకు అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు పోలీసులకు, అంగన్వాడిలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ లోగా జిల్లా రెవెన్యూ అధికారి వచ్చి వారితో చర్చించిన అనంతరం అంగన్వాడీ లు శాంతించారు.
ప్రభుత్వం స్పందించకుంటే తాడో పేడో తేల్చుకుంటాం : ఏపీ అంగన్వాడీ వర్కర్స & హెల్పర్స్ యూనియన్ కృష్ణా జిల్లా కమిటీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)