లక్నో : ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో సుమారు 4,000మందిని మోసం చేసినట్లు పోలీసు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా తిఖంపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. లఘు ఉద్యోగ్ వికాస్ పరిషత్, ఉజ్వల శిక్షా మిషన్, ఆద్యోగిక్ శిక్షణ్ మహిళా వికాస్ యోజనల పేరుతో నిందితులు గ్రామస్తులను మోసం చేశారని, నెలకు రూ.15,000జీతం వస్తోందని ఆశచూపినట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఇద్దరు వ్యక్తులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని నిందితులు చెప్పారని, సెక్యూరిటీ కింద రూ.40,000 చెల్లించాలని కోరినట్లు తెలిపారు. సుమారు 4,000మందికి పైగా అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి, నకిలీ నియామక పత్రాలను పొందారని పేర్కొన్నారు. కొంత మంది అభ్యర్థులతో పని కూడా చేయించారని, అనంతరం నిందితులు కార్యాలయాన్ని మూసివేసి పారిపోయారని అన్నారు. పర్సుపూర్ గ్రామానికి చెందిన రాజేష్ కుమార్ కన్నౌజియా ఫిర్యాదు ఆధారంగా 13మందిపై, మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. బిఎన్‌ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద పేర్లు నమోదు చేశారని, దర్యాప్తు చేపడుతున్నట్లు స్టేషన్ హౌస్ అధికారి వంశ్ బహదూర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో యుపిలో భారీ మోసం ..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 11:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)