ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి హరి కిషన్ సింగ్ సుర్జిత్‌కు సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు, సిపిఎం కేంద్ర కమిటీ కార్యాలయం (ఎకెజి భవన్)లో శనివారం సుర్జీత్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, మరియం ధావలే, ఆర్ అరుణ్ కుమార్, రాజ్యసభ ఎంపి వి శివదాసన్, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా, అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి కనినికా ఘోష్, సీనియర్ నాయకులు సుభాషిణి అలీ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ రాష్ట్ర కమిటీ కార్యాలయంలోనూ హరి కిషన్ సింగ్ సుర్జిత్ భవన్‌లో ఒక స్మారక సభ జరిగింది. సుర్జిత్ విగ్రహానికి ఆర్ అరుణ్ కుమార్ పూలమాల వేసి, నివాళులర్పించారు.
హరికిషన్ సింగ్ సుర్జిత్‌కు ఘన నివాళి
01 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 09:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)