- జోధ్‌పూర్‌లో ఉద్రిక్తత
జోధ్‌పూర్: నీట్ పేపర్ లీకేజిపై ఢిల్లీ వేధికగా ఉద్యమించిన కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి)పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బిజెపి డుబుల్ ఇంజన్ సర్కార్ కొలువుతీరిన రాజస్ధాన్ జోధ్‌పూర్‌లోని గాంధీ శాంతి ప్రతిష్ఠాన్ కేంద్రంలో బిజెపి అనుభంద ఎబివిపి, బిజెవైఎం గూండాలు సిజెపి కార్కకర్తలపై దాడులకు తెగబడ్డాయి.
ఏం జరిగింది?
జోధ్‌పూర్‌లోని రెసిడెన్సీ రోడ్‌లో ఉన్న గాంధీ శాంతి ప్రతిష్ఠాన్ కేంద్రంలో కాక్రోచ్ జంతా పార్టీ (సిజెపి) ‘'శిక్షా బచావో, దేశ్ బచావో’ అనే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించింది. దీనికి సిజెపి సహాయ కన్వినర్ అశుతోష్ రాంకా హాజరయ్యారు. అయన మాట్లాడుతున్న సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి), భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం)కు చెందిన కార్యకర్తలు పాఠశాల గోడ దూకి వచ్చి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. ఎబివిపి గూండాలు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వేదికను ద్వంసం చేశారు. దీంతో సిజెపి విద్యార్థులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. సిజెపి విధ్యార్థులపై ఎబివిపి కార్యకర్తలు దాడి చేసి, బట్టలు చించేశారు. ఈ ఘటనలో ఎబివిపి జోధ్‌పూర్ విభాగ కన్వీనర్ లలిత్ దాదీచ్, బిజెవైఎం రాష్ట్ర ప్రతినిధి రాజ్‌వీర్ సింగ్ బంతాతో సహా దాదాపు 10 నుంచి 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి సంబంధించి అధికారికంగా ఫిర్యాదు అందిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.








కామెంట్‌లు (0)