శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రావణమాసం పేరుతో మాంసం దుకాణాల మూసివేత.. కోర్టులోనూ దక్కని న్యాయం

8 గంటల క్రితం

Allahabad High Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 03:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

లక్నో : శ్రావణ మాసం పేరుతో మాంసం దుకాణాలను మూసివేయడమేమిటని ప్రశ్నించిన ముస్లింలకు కోర్టులోనూ న్యాయం దక్కలేదు. అమ్రోహాలో చికెన్‌, మటన్‌ దుకాణాలను మూసివేయాలంటూ స్థానిక అధికారులు, పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిల్‌ను అలహాబాద్‌ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. కన్వర్‌యాత్ర సమయంలో మాంసం దుకాణాలను మూసివేయాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసుల చట్టబద్ధతను సవాలు చేస్తూ, అమ్రోహాకు చెందిన న్యాయవాది నాసిర్‌ ఫరూక్‌ ఈ పిల్‌ను దాఖలు చేశారు. పిటిషనర్‌ స్వయంగా ఒక న్యాయవాది అని పేర్కొన్న కోర్టు, ఈ అభ్యర్థన ప్రజా ప్రయోజనం కోసం కాకుండా ప్రచారం కోసం దాఖలు చేయబడిందని వ్యాఖ్యానిస్తూ .. పిల్‌ను కొట్టివేసింది. శ్రావణమాసం, కన్వర్‌ యాత్ర కారణంగా మాంసం దుకాణాలను మూసివేయాలని స్థానిక అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని పిటిషన్‌ సవాలు చేసింది. కన్వర్‌ యాత్రకు దూరంగా రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను కూడా మూసి ఉంచాలని ఆదేశించారని తెలిపింది. తేదీ లేకుండా నోటీసులు జారీ చేశారని, అనంతరం వాటిని బలవంతంగా మూసివేయించారని పేర్కొంది. ఈ చర్య వందలాది మంది జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. ముందుగా శ్రావణ మాసంలో నిర్దిష్టంగా నాలుగు సోమవారాల్లో మాత్రమే దుకాణాలను మూసివేయాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించినప్పటికీ.. నెలరోజులూ మంసం దుకాణాలను తెరవకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంది. ఈ చర్యతో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి, జీవనోపాధికి సంబంధించిన సంక్షోభం ఏర్పడిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ముస్తకీమ్ అహ్మద్ కోర్టులో వాదించారు. అమ్రోహాలో జారీ చేసిన మూసివేత ఆదేశాలు కేవలం కన్వర్‌ యాత్ర మార్గానికే పరిమితం కాకుండా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని వ్యాపారాలపై కూడా ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు. కన్వర్‌ యాత్రా మార్గానికే పరిమితం కాకుండా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని వ్యాపారాలపై కూడా ప్రభావం చూపాయని పిటిషనర్ వాదించారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ పిటిషన్‌ను వ్యతిరేకించింది. యుపిలో ముస్లింలపై యోగి ప్రభుత్వం కక్ష‍సాధింపు చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే. గుతోంది. శ్రావణమాసం, కన్వర్‌ యాత్ర పేరుతో వారి ఉపాధి, జీవనోపాధిని దెబ్బతీస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్