శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అలయన్స్ ఎయిర్‌ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

1 గంట క్రితం

Alliance Air
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాయ్‌పూర్‌ : అలయన్స్‌ ఎయిర్‌కు చెందిన ప్రయాణికుల విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుండి బిలాస్‌పూర్ వెళ్తున్న విమానం ఛత్తీస్‌గఢ్‌ విమానాశ్రయంలో ల్యాండిగ్‌ అవుతుండగా టైర్‌ పేలిపోయింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అలయన్స్ ఎయిర్‌కు చెందిన 9I613 విమానం ఢిల్లీ నుండి బిలాస్‌పూర్‌ వెళుతుండగా ఎడమవైపు టైర్‌ పేలిపోయింది. ఆ సమయంలో 37 మంది ప్రయాణికులు మరియు నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే వారంతా సురక్ష‍ితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్