ప్రధాని పర్యటన నేపథ్యంలో ముగ్గురి అరెస్టు
ముంబయి : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాల్లో ఒకచోట ఆయుధాలతో బలవంతంగా ప్రవేశించడానికి యత్నించారనే ఆరోపణలతో ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బికెసి) లోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను మోడీ సోమవారం సాయంత్రం సందర్శించారు. ఈ పర్యటనకు కొన్ని గంటల ముందు బికెసిలో బలవంతంగా ప్రవేశించడానికి ముగ్గురు ప్రయత్నించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేస్తున్నట్లుగా నకిలీ గుర్తింపు కార్డులతో పాటు వీరి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. బికెసి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని రోహన్ ప్రేమల్ పరేఖ్, దిలీప్ రాజారామ్ కుండే, ప్రథమేష్ గణేష్ బగుల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు డిసిపి క్రైమ్ బ్రాంచ్ రాజ్ తిలక్ రోషన్ తెలిపారు.








కామెంట్‌లు (0)