సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు

18 గంటల క్రితం

loksabha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ 11వ రోజు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచే ప్రతిపాదన ఇందులో ఉంది. 1956 నాటి చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఈ మార్పు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. సుప్రీంకోర్టులో పెరుగుతున్న పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్