న్యూఢిల్లీ : నీట్ యుజి-2026 పేపర్ లీక్ కేసులో 13 మందికి వ్యతిరేకంగా శుక్రవారం సిబిఐ ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ ప్రకారం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)కు చెందిన ముగ్గురు నిపుణులు మనీషా గురునాథ్ మంధారే (ఎ-1), ప్రహ్లాద్ విఠల్‌రావు కులకర్ణి (ఎ-2), మనీషా సంజయ్ హవల్దార్ (ఎ-3)ను పేపర్ లీక్‌కు ప్రధాన నిందితులుగా పేర్కొంది. వీరంతా తమ అధికారంతో నీట్ ప్రశ్నపత్రాలను అనధికారికంగా పొంది, వాటిని సిండికేట్ సభ్యులతో పంచుకున్నారని సిబిఐ తెలిపింది. అయితే ఇందుకోసం సెల్‌ఫోన్ వంటివి వినియోగించుకుండా, చీట్టీలపై ప్రశ్నలు రాసుకోవడం, కంఠస్తం పట్టడం వంటివి చేశారని తెలిపింది. అలాగే, మిగిలిన నిందితులైన కోచింగ్ ఆపరేటర్లు, మధ్యవర్తులు, అభ్యర్థుల పేర్లను సిబిఐ ఛార్జీషీట్‌లో పేర్కొంది. ఈ కేసులో మరో కీలక నిందితుడైన రసాయన శాస్ర్త అధ్యాపకుడు ప్రహ్లాద్ విఠల్‌రావు కులకర్ణికి సంబంధించిన యాప్ డేటాను అధికారులు సేకరించారు. పుణెలో ఆయన నివసిస్తున్న రెసిడెన్షియల్ సొసైటీ ఉపయోగించే యాప్ డేటా, ఆయన నిర్వహించిన కోచింగ్ సెంటర్‌కు హాజరయ్యే విద్యార్థుల బయోమెట్రిక్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై అవినీతి నిరోధక చట్టం, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం 2024లోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపింది.
నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ ఛార్జీషీట్ దాఖలు
07 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 08, 2026, 12:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)