ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ పాల్గొనాల్సిన ఉత్తరప్రదేశ్‌లోని రెండు యువ ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. మీరట్‌లో శుక్రవారం, వారణాసిలో ఈ నెల 28న జరగాల్సిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ఇఎల్‌సి) కార్యక్రమాలను వాయిదా వేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మీరట్, వారణాసిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువ ఓటర్లు, బూత్ స్థాయి అధికారుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ఎన్నికల నమోదు, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల సంఘం పాత్ర, ప్రజాస్వామ్య విలువలపై యువతకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. 500 నుంచి 1500 మందికిపైగా పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఏకపక్ష వ్యవహార శైలి, సిఇసి తీరుపై మిగిలిన ఎన్నికల సంఘం సభ్యుల్లో ఉన్న వ్యతిరేకత, దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
మీరట్, వారణాసిలో సిఇసి యువ ఓటర్ల కార్యక్రమాలు వాయిదా
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 10:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)