శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కేంద్రం ఉదాసీనత సరికాదు : విజయన్

11 గంటల క్రితం

vijayan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 03:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం : నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న సోనమ్‌ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్‌ మండిపడ్డారు. నిరవధిక నిరాహార దీక్ష‍ చేపడుతున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమించిందన్న వార్తపై పినరయి విజయన్‌ గురువారం ఎక్స్‌ పోస్ట్‌లో స్పందించారు. వాంగ్‌చుక్‌ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో తాను తీవ్ర ఆవేదనకు గురైనట్లు ప్రకటించారు. న్యాయం కోసం పోరాడుతున్న ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమూ ఉదాసీనంగా ఉండకూడదని అన్నారు. నీట్ పేపర్ లీక్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తన మౌనాన్ని వీడాలని, అర్థవంతమైన చర్చలు జరపాలని కోరారు. అలాగే ఈ సంక్ష‍ోభానికి జవాబుదారీతనం ఉండాలన్న న్యాయమైన డిమాండ్‌పై స్పందించాలని స్పష్టం చేశారు. చర్యల్లో భాగంగా జాతీయ పరీక్షా విధానంలో స్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నీట్‌, ఇతర పరీక్ష‍ల్లో న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్, విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్