మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

“కామరాజర్‌ అల్పాహార పథకం’’ విస్తరణ ప్రారంభించిన విజయ్‌

1 గంట క్రితం

CM Vijay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ మంగళవారం ‘ పెరుంతలైవర్‌ కామరాజర్‌ అల్పాహార పథకం’ను 6నుండి 8వ తరగతి విద్యార్థులకు వర్తింపజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెన్నైలోని తిరువాన్మియూర్‌ గాంధీ గ్రామం కార్పోరేషన్‌ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి విజయ్‌ కూడా విద్యార్థులతో కూర్చుని అల్పాహారం చేశారు. ఈ పథకం విస్తరణతో రాష్ట్రంలోని 15,454 ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 6నుండి 8వ తరగతులు చదువుతున్న సుమారు 15.3 లక్ష‍ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం అదనంగా రూ.217.63కోట్ల నిధులను కేటాయించింది. ఈ పథకం కింద గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 447 ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో కేంద్రీకృత వంటశాలల ద్వారా అల్పాహారం తయారు చేసి అందించనున్నారు. అదేవిధంగా, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, టౌన్ పంచాయతీ ప్రాంతాలలోని 2,150 ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో, మున్సిపల్ పరిపాలన డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీకృత వంటశాలల ద్వారా అల్పాహారం తయారు చేసి అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ పంచాయతీ పరిధిలోని మిగిలిన 12,857 ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో, 'తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థ'కు అనుబంధంగా ఉన్న స్వయం-సహాయక సంఘాల సభ్యులు అల్పాహారాన్ని తయారు చేసి అందించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్