- వందేమాతరానికి చట్టబద్ధమైన బిల్లును వ్యతిరేకించిన సిపిఎం
న్యూఢిల్లీ : వందేమాతరానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడాన్ని సిపిఎం వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనదని వ్యాఖ్యానించింది. జాతీయ గౌరవానికి అవమానాల నిరాకరణ సవరణ బిల్లు, 2026ను సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో సిపిఎం పక్ష నేత, ఎంపి జాన్ బ్రిట్టాస్ 67వ నిబంధన కింద నోటీసు ఇచ్చారు.
జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ ఒక్కటేనా?
జాతీయ గీతమైన వందేమాతరానికి చట్టబద్ధమైన హోదా, రక్షణ కల్పించాలని ఈ బిల్లు కోరుతోంది. కాగా రాజ్యాంగంలో, పార్లమెంట్‌లో ఈ హోదాను ఉద్దేశ్యపూర్వకంగానే నిలుపుచేశారని బ్రిట్టాస్ పేర్కొన్నారు. 950 జనవరి 24న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసిన స్టేట్‌మెంట్ ఆఫ్ అబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ (ఉద్దేశ్యాలు, కారణాల ప్రకటన)ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ అంశంపై అధికారికంగా ఒక తీర్మానాన్ని ఆమోదించరాదని రాజ్యాంగ నిర్ణయాక అసెంబ్లీ నిర్ణయించిన విషయాన్ని ఇది విస్మరిస్తోందని అన్నారు. ఆ నిర్ణయం ఫలితంగానే, ఆ స్టేట్‌మెంట్‌కు ఎన్నడూ రాజ్యాంగబద్ధమైన బలం లేదన్నారు.








కామెంట్‌లు (0)