న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ మద్దతు తెలిపారు. ఈ నెల 11వ తేదీన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ( యుఎఫ్‌బియు) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మెకు మద్దతు తెలుపుతూ ఎంఎ బేబీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. బ్యాంక్ ఉద్యోగుల ఈ పోరాటం కేవలం వారి హక్కుల కోసం మాత్రమే కాదని, భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను, శ్రామిక ప్రజల ప్రజాస్వామిక హక్కులను ప్రైవేటీకరణ, కార్పొరేట్ దోపిడీ నుంచి కాపాడుకునే పోరాటమని ఎంఎ బేబీ పేర్కొన్నారు. అన్ని రంగాలకు చెందిన శ్రామిక వర్గం, యువత, పౌర సమాజం, విస్తృత ప్రజానీకం బ్యాంక్ ఉద్యోగులకు అండగా నిలవాలని, ఈ సమ్మెను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని బేబీ విజ్ఞప్తి చేశారు. ‘‘మనమంతా కలిసి గళం విప్పుదాం, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుదాం, భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కూల్చివేయకుండా కాపాడుకుందాం!’’ అని పోస్టులో తెలిపారు.
బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సిపిఎం మద్దతు
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 02:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)