సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ హైకోర్టుకి ఏడుగురు కొత్త జడ్జీలు

50 నిమిషాల క్రితం

Delhi High Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఏడుగురు న్యాయాధికారులు ఢిల్లీ హైకోర్టు జడ్జీలుగా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఢిల్లీ హైకోర్టులో జడ్జీల సంఖ్య 50కి చేరింది. ఢిల్లీలోని జిల్లా కోర్టులో న్యాయాధికారులుగా పనిచేస్తున్న నివేదిత అనిల్‌ శర్మ, నిషా సహాయ్‌ సక్సేనా, సంజయ్‌ శర్మ, భరత్‌ పరాశర్‌, అదితి చౌదరి, దినేష్‌ భట్‌, అరుణ్‌ భరద్వాజ్‌లతో ప్రధాన న్యాయమూర్తి డి.కె.ఉపాధ్యాయ హైకోర్టులో వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కొత్త జడ్జీలను ఆయన అభినందించారు. జస్టిస్‌ శర్మ, సక్సేనా ఆంగ్లంలో ప్రమాణం చేయగా, మిగిలిన వారు హిందీలో ప్రమాణం చేశారు. వీరు హైకోర్టు అదనపు జడ్జీలుగా నియమితులయ్యారు. ఈనియామకాలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 19న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టుకు మంజూరైన జడ్జీల సంఖ్య సంఖ్య 60 కాగా, ఈ ఏడుగురి నియామకాలతో ప్రస్తుతం ఆ సంఖ్య 50కి చేరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్