ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జంతర్‌మంతర్‌ వద్ద నిరసనను అడ్డుకున్న పోలీసులు .. పలువురు నేతలు, కార్యకర్తల అరెస్ట్‌

1 రోజు క్రితం

Jantar Mantar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 12:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సిఇసిని అరెస్టు చేయాలి : ఎం.ఎ. బేబీ

ఓటర్ల హక్కుల పరిరక్షణకు విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన

న్యూఢిల్లీ : ప్రధాన న్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనకు దిగిన సిపిఐ(ఎం), విద్యార్థి, యువజన సంఘాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ) కార్యకర్తలు నిరసనలో పాల్గొనేందుకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జంతర్‌మంతర్‌ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి, రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకారులు ఆందోళన స్థలానికి చేరుకోకుండా నిర్బంధాలు విధించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు డ్రోన్లను సైతం వినియోగించారు. ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేశారు.

సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ మాట్లాడుతూ.. ప్రజల ఓట్లను తొలగించే నేరపూరిత చర్యకు పాల్పడిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం నిరసన తెలుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఓటర్ల హక్కులను హరించే చర్యలకు బాధ్యత వహించాల్సింది ఎన్నికల కమిషనరేనని పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సిఇసి రాజీనామాను డిమాండ్‌ చేస్తూ నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు మనోజ్‌ ఝా, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, ఐసా తదితరులు ఈ నిరసనకు మద్దతు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ఆందోళనకు సుమారు 3,000 నుంచి 4,000 మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంచనా వేశాయి. దీంతో జంతర్‌మంతర్‌ పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి, నిరసనకారులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు డ్రోన్లను కూడా వినియోగించారు.


జంతర్‌మంతర్‌ సమీపంలోకి చేరుకున్న సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సహా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండి హౌస్‌ వైపు నుంచి జంతర్‌మంతర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సివిల్‌ ఇంజనీర్‌ అమిత్‌ శర్మ మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులందరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నప్పటికీ, తన పేరు మాత్రం తొలగించారని తెలిపారు. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఈ సమస్యపై నిరసన తెలిపేందుకు వచ్చినప్పటికీ ఆందోళన స్థలానికి చేరుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.


మరోవైపు, సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) ముంబయిలోని శివాజీ పార్కులో నిరసనకు పిలుపునిచ్చింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే నేతృత్వంలో ఆందోళన జరగనుంది. శివాజీ పార్క్ సహా పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

mababy


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్