బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వివిధ రాష్ట్రాల్లోని 14 టోల్‌ ప్లాజాలపై ఈడీ దాడులు

1 గంట క్రితం

toll
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 09:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 14 టోల్‌ ప్లాజాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనిఖీలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, న్యూఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌ ప్లాజాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. టోల్‌ వసూళ్లలో జరుగుతున్న అవకతవకలు, మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఈడీ తెలిపింది. 2025లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అధికారిక వ్యవస్థకు వెలుపల టోల్‌ వసూలు చేసేందుకు నకిలీ రసీదులు రూపొందించినట్లు డిజిటల్‌ ఆధారాలు లభించాయని ఈడీ పేర్కొంది. ఈ రసీదుల తయారీకి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్లు గుర్తించిన అధికారులు, ఆధారాల ఆధారంగా దర్యాప్తును మరిన్ని టోల్‌ ప్లాజాలకు విస్తరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్