బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకల్లో విషాదం

1 గంట క్రితం

pk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 09:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- విద్యుత్‌ షాక్‌తో అభిమాని మృతి

అమలాపురం: జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్‌ వైరు తగలడంతో ఓ యువకుడు మృతి చెందాడు. బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్‌కుమార్‌ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రేమ్‌కుమార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి నిర్వహించేందుకు స్వగ్రామానికి వచ్చాడు. అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్‌ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్