కుపెర్టినో: యాపిల్ సంస్థలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. 15 ఏళ్లపాటు సంస్థకు సీఈఓగా సేవలందించిన టిమ్ కుక్ నుంచి జాన్ టెర్నస్ యాపిల్ పగ్గాలను అందుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి టెర్నస్ సంస్థ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. టిమ్ కుక్ ఇకపై యాపిల్ బోర్డుకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. కుక్ హయాంలో యాపిల్ భారీగా విస్తరించి, సుమారు 350 బిలియన్ డాలర్ల కంపెనీ నుంచి 4.5 ట్రిలియన్ డాలర్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగింది. ఐఫోన్‌తో పాటు యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్, సర్వీసెస్ విభాగాల విస్తరణలో కుక్ కీలక పాత్ర పోషించారు. మరోవైపు హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన టెర్నస్ 2001లో యాపిల్‌లో చేరారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. టెర్నస్ ముందున్న ప్రధాన సవాళ్లలో కృత్రిమ మేధ (ఎఐ) రంగంలో యాపిల్‌ను మరింత బలోపేతం చేయడం, సిరి అభివృద్ధిని వేగవంతం చేయడం, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, సరఫరా వ్యవస్థలో మార్పులను సమర్థంగా నిర్వహించడం ఉన్నాయి.
యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 09:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)