మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇటీవలే నిశ్చితార్థం .. అంతలోనే కబళించిన మృత్యువు

7 గంటల క్రితం

Engaged just recently... claimed by death soon after.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 11:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కేరళ : ఇటీవలే నిశ్చితార్థమైంది. త్వరలో మరో ఉద్యోగం చూసుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్నాడు. కానీ, అంతలోనే మృత్యువు కబళించింది. ఉక్రెయిన్‌లోని ఒడిశా పోర్టు నుంచి వెళుతున్న వాణిజ్య నౌకపై ఆదివారం జరిగిన దాడిలో కేరళకు చెందిన సెయిలర్‌ అఖిల్‌ జోయాన్‌ (26) అనే యువకుడు మృతి చెందాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామనుకున్న తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. స్థానిక మీడియా కథనాల మేరకు .. కేరళలోని కాసర్‌గఢ్‌ జిల్లాకు చెందిన జోయాన్‌-శాలీ దంపతులకు అఖిల్‌ ఏకైక సంతానం. అతడు ఆరేళ్లుగా ‘ఎంవీ గోల్డెన్ లియో’ నౌకలో నావికుడిగా పని చేస్తున్నాడు. కొన్ని వారాల క్రితమే అతడికి నిశ్చితార్థం అయ్యింది. నెల రోజుల క్రితమే తిరిగి విధుల్లో చేరాడు. త్వరలో మరో మెరుగైన ఉద్యోగం చూసుకొని రెండు నెలల్లో వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఇంతలోనే ఆదివారం నౌకపై జరిగిన దాడి లో అతడు మరణించినట్లు సమాచారం అందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను కోరారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు రష్యన్ కాన్సులేట్, విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకుంటున్నట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. రష్యా దాడిలో అఖిల్‌తో సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరో భారత నావికుడి పరిస్థితి విషమంగా ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్