న్యూఢిల్లీ : రోడ్డు ఉన్న ప్రతీ చోటా పాదాచారుల కోసం నడక మార్గం ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం మరోసారి స్పష్టం చేసింది. పాదాచారుల కోసం స్పష్టమైన సరిహద్దులతో, ఆక్రమణలకు గురికాని స్థలం (మార్గం) ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ స్థలం (మార్గం) తమ కోసమేనని, వాహనాల బెడద లేకుండా స్వేచ్ఛగా నడవవచ్చని పాదచారులకు నమ్మకం కలగాలని కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి)కె.ఎం. నరరాజ్‌కు జస్టిస్ పి.ఎస్. నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇవ్వడానికి ధర్మాసనం ఎఎస్‌జికి రెండు వారాల గడువు ఇచ్చింది. ‘ప్రతీ రోడ్డుకు భారీ పెట్టుబడి, నిర్మాణం లేకుండా, సక్రమమైన సరిహద్దులతో పాదాచారులకు స్థలం గుర్తించండి, రోడ్డు ఉన్న ప్రతిచోటా నడిచేవారి కోసం స్థలం ఉండాలి. తాడుతో లేదా మరేదైనా దానితో దీన్ని ఏర్పాటు చేయండి. అలాగే అది ఆక్రమణకు గురికాకుండా చూసుకోండి’ అని ధర్మాసనం ఎఎస్‌జికి తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. జూన్ 19న ఇచ్చిన ఒక కీలకమైన తీర్పులో గుర్తించబడిన ఫుట్‌పాత్‌పై నడిచే హక్కు ఒక ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు పేర్కొన సంగతి తెలిసిందే. మోటారు వాహనాల కంటే ఈ హక్కుకు ప్రాధాన్యత ఉంటుందని, ఈ హక్కు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 (1) (డి) కింద హామీ ఇచ్చిన సంచార హక్కు, ఆర్టికల్ 21 (జీవించే మరియు స్వేచ్ఛ హక్కు)తో సహా ఇతర ప్రాథమిక హక్కులలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రతీ రోడ్డుకు నడక మార్గం ఉండాల్సిందే
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)