శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అస్సాం వరదల్లో మరో ఏడుగురు మృతి

3 రోజుల క్రితం

assam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 07:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 75కు చేరిన మృతుల సంఖ్య

- నీట మునిగిన 45,341.98 హెక్టార్ల వ్యవసాయ భూమి

గౌహతి: అస్సాంలో వరదల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మంగళవారం మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 3.32 లక్షల మంది వరదల ప్రభావానికి గురైనట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) వెల్లడించింది.

మంగళవారం నమోదైన ఏడు మరణాలు శివసాగర్ జిల్లాలోని నసిరా రెవెన్యూ సర్కిల్ పరిధిలో చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ఇంకా నీట మునిగే పరిస్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం శివసాగర్, చరాయిడియో, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, సోనిత్‌పూర్, కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మొత్తం 21 రెవెన్యూ సర్కిళ్లలోని 622 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 3,32,639 మంది ప్రభావితులయ్యారు. ఇందులో చరాయిడియో జిల్లాలో 1,42,756 మంది, శివసాగర్‌లో 97,074 మంది, జోర్హాట్‌లో 57,371 మంది వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం నమోదైన 4.45 లక్షల మందితో పోలిస్తే బాధితుల సంఖ్య తగ్గినప్పటికీ, అనేక ప్రాంతాల్లో నీరు ఇంకా తగ్గలేదు.

ప్రజల సహాయార్థం రాష్ట్రవ్యాప్తంగా 81 సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా, వాటిలో 32,477 మంది ఆశ్రయం పొందుతున్నారు. అదనంగా 34 సహాయక పంపిణీ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. సైన్యం, వైమానిక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవలు, పౌర వాలంటీర్లు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, గోలాఘాట్ జిల్లాలోని నుమాలిగడ్ వద్ద ధన్‌సిరి నది ఇంకా ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరదల కారణంగా రాష్ట్రంలో 45,341.98 హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్