మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్టు

1 గంట క్రితం

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్టు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఢిల్లీ జల్ బోర్డు (డిజెబి) చెందిన ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ మంత్రి, ఆప్‌ ‌నేత సత్యేందర్‌ ‌జైన్‌‌తో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో డిజెపి మాజీ సిఇఓ ఉదిత్ ప్రకాష్ రాయ్‌, కాంట్రాక్ట్ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాస్తవ, ఇతరులు నాగేంద్ర యాదవ్, రాజా కుమార్ కుర్రా, పంకజ్ వర్మ ఉన్నారని ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ మంగళవారం వెల్లడించింది. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల విస్తరణ, ఆధునీకరణకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియలో భారీస్థాయిలో అవకతవకలు, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ విజిలెన్స్ డైరెక్టరేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 మే 11న ఈ కేసు నమోదయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్