మంగళవారం, 15 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళా బైకర్‌ను ఢీకొన్న నిందితుడు అరెస్ట్‌

1 గంట క్రితం

gurugram -1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కళ్యాణ్‌ బైన్స్లాను రాజస్థాన్‌ నుండి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని అన్నారు. ఈ నేరానికి గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష‍ విధించే అవకాశం ఉంది. ఆదివారం, గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఒక తెల్లటి సెడాన్ కారు అకస్మాత్తుగా కుడివైపుకు దూసుకువచ్చి మహిళా బైకర్‌ సియాను ఢీ కొట్టింది. ఆమె కిందపడిపోగా, బైక్ రోడ్డుపై జారుతూ నిప్పురవ్వలు ఎగజిమ్ముతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్