ముంబయి : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి అని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పేర్కొంది. సిఇసి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబయిలోని శివాజీ పార్క్‌లో శుక్రవారం సిజెపి ఆందోళన చేపట్టింది. పలువురు సిజెపి కార్యకర్తలు, యువత ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళనకు సిజెపి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిజెపి ప్రతినిధి సౌరవ్‌దాస్ మాట్లాడుతూ.. సిఇసి జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి అని అన్నారు. ఆయనను ప దవి నుండి తొలగించాలన్న డిమాండ్‌కు దేశం మొత్తం మద్దతు ఇస్తుందని అన్నారు. నేడు ముంబయిలో ప్రారంభించిన నిరసన అతిపెద్ద ఆందోళనగా మారనుందని అన్నారు. ముంబయి స్ఫూర్తి ఏమిటో గతంలోనే నిరూపితమైందని అన్నారు. ధర్మేంద్రప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా యువతతో పాటు పలువురు నేతలు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ విషయంలోనూ అదే జరుగుతోందని అన్నారు. ముంబయి యువత మరోసారి వీధుల్లోకి వచ్చారని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా నిరసన తీవ్రతరమౌతుందని అన్నారు.
సిఇసి జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి : సిజెపి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)