శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిఇసి జ్ఞానేష్‌ కుమార్‌‌పై పాత కేసు విచారణ..

19 గంటల క్రితం

cec
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 07:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విజిలెన్స్‌‌ నుండి దర్యాప్తు పత్రాలు కోరిన కేరళం హోం శాఖ

తిరువనంతపురం : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌(సిఇసి) పదవి నుంచి జ్ఞానేష్‌ కుమార్‌ గద్దె దిగాలని డిమాండ్‌చేస్తూ ఆందోళనలు, నిరసనలు ఉధృతమవుతున్న తరుణంలో ఆయనపై 20ఏళ్ళ క్రితం నమోదైన పాత కేసునొకదాన్ని కేరళం ప్రభుత్వం వెలికితీస్తోంది. 2006లో ఆయనపై విజిలెన్స్‌ ‌బ్యూరో జరిపిన ప్రాధమిక విచారణకు సంబంధించిన ఫైల్స్‌‌ను పంపాలంటూ కేరళం హోం శాఖ విజిలెన్స్‌ ‌విభాగాన్ని కోరింది. 2006లో జ్ఞానేష్‌‌ కుమార్‌ ‌కేరళంలో వర్క్స్‌ ‌సెక్రటరీగా పనిచేసేవారు. రెండు దశాబ్దాల క్రితం మలేసియాకు చెందిన సివిల్‌ ఇంజనీర్‌ లీ సీ బీన్‌ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో జ్ఞానేష్‌‌పై విజిలెన్స్‌, అవినీతి నిరోధక బ్యూరో ప్రాధమిక దర్యాప్తు చేపట్టాయి. కోట్లాది డాలర్ల ‌కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా ప్రాజెక్ట్‌ ‌కింద ఎంసి రోడ్‌‌ను అభివృద్ధిపరిచే కార్యక్రమంలో ఇండో మలేసియన్‌ ‌కన్సార్టియం పాటి-బెల్‌ ‌చీఫ్‌ ‌ప్రాజెక్టు మేనేజర్‌‌గా ఈ సివిల్‌ ఇంజనీర్‌ పనిచేసేవారు. ప్రభుత్వ అధికారుల వల్ల తన బిల్లులు ఆమోదం పొందే ప్రక్రియకు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో ఆయన కౌలాలంపూర్‌ ‌వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. లీ తన సూసైడ్‌ ‌నోట్‌‌లో జ్ఞానేష్‌ ‌పేరు ప్రస్తావించడంతో ఈ వివాదంలో ఆయన పేరు చోటు చేసుకుంది. వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి,దానివల్ల ప్రాజెక్టు అమలులో తీవ్ర జాప్యం కావడం, ఫలితంగా బిల్లులు పెరిగిపోవడం వంటి అంశాలు లీ నోట్‌‌లో పేర్కొన్నారు. ఫలితంగా ఈ మొత్తం వ్యవహారంపై ఆనాటి ఎల్‌‌డిఎఫ్‌ ‌ప్రభుత్వం విజిలెన్స్‌ ‌విచారణకు ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్