సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కేరళలో భారీ వర్షాలు.. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

20 గంటల క్రితం

Southwest monsoon set to revive across the country
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 07:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో పలుచోట్ల 7 నుంచి 11 సెంటీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, త్రిసూర్, ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలప్పుళ జిల్లాలో సహాయక శిబిరాలుగా కొనసాగుతున్న విద్యాసంస్థలతో పాటు చెంగన్నూర్, కుట్టనాడ్ తాలూకాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, అంగన్‌వాడీలు, ట్యూషన్ సెంటర్లకూ సెలవులు ప్రకటించారు.నదుల నీటిమట్టాలు, కొండ ప్రాంతాల పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. విపత్తు నిర్వహణ బృందాలను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్