శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

3 గంటల క్రితం

acidnet.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 07:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పౌరి: ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవప్రయాగ్‌–పౌరి మోటార్‌ రోడ్డుపై కుండ్ధార్‌ సమీపంలో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి సుమారు 250 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 16 ఏళ్ల బాలుడు గాయాలతో బయటపడ్డాడు. మరో ప్రయాణికుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రమాద సమయంలో బొలెరోలో ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా హరిద్వార్‌ జిల్లా లక్సర్‌ కొత్వాలి పరిధిలోని రాయ్‌పూర్‌ జీత్‌పూర్‌ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే దేవప్రయాగ్‌ పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్