బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమహారాష్ట్రలో డాక్టర్ల నిరవధిక సమ్మె

05 ఆగస్టు, 2026

DHARNA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 11:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సర్టిఫికేట్‌ కోర్సు చేసిన వాళ్లకూ రిజిస్ట్రేషన్‌ అవకాశం

  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైద్యులు

ముంబయి : మహారాష్ట్రలో ప్రభుత్వ, కార్పొరేషన్‌ ‌నిర్వహణలోని 32 మెడికల్‌ ‌కాలేజీలకు చెందిన 12వేల మందికి పైగా రెసిడెంట్‌ ‌డాక్టర్లు బుధవారం నుండి నిరవధికంగా సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. సిసిఎంపి (సర్టిఫికెట్‌ ‌కోర్స్‌ ఇన్‌ ‌మోడరన్‌ ‌ఫార్మాకాలజీ) పూర్తిచేసిన హోమియోపతి ప్రాక్టీషనర్లను మహారాష్ట్ర మెడికల్‌ ‌కౌన్సిల్‌ (ఎంఎంసి)లో నమోదు చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకోదలచిన చర్యను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ)లో నమోదైన డాక్టర్లు కూడా మంగళవారం నుండి ప్రారంభించిన తమ రాష్ట్రవ్యాప్త నిరసనను ఉధృతం చేశారు. గురువారం నుండి అత్యవసర సేవలతో సహా అన్ని రకాల సేవల నుండి నిరవధికంగా వైదొలగుతామని వారు ప్రకటించారు. ఈ మేరకు ఐఎంఎ మహారాష్ట్ర ఆఫీసు బేరర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. బాంబే హైకోర్టు తన తుది తీర్పు ఇచ్చేవరకు ఈ ప్రతిపాదిత చర్యను నిలుపుచేయాల్సిందిగా తాము కోరామని మహారాష్ట్ర రెసిడెంట్‌‌ డాక్టర్ల అసోసియేషన్‌ (‌మర్ద్‌) అధ్యక్షుడు డాక్టర్ అధర్వ షిండే చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్