ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెనడాలో భారత సంతతి మహిళ అరెస్ట్‌!

6 గంటల క్రితం

canada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 02:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- భీఫ్‌ వండుతున్నారంటూ అద్దెకున్న వ్యక్తితో వివాదం..

ఒట్టావా : కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం, సర్రే ప్రాంతంలో నివసిస్తున్న రాజ్ తివానా అనే భారత సంతతి మహిళా యజమానురాలికి, ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తికి మధ్య జరిగిన వివాదం అరెస్టుకు దారితీసింది. బార్బెక్యూ వండుకోవడంపై మొదలైన వాదన ఘర్షణగా మారింది. అద్దెకున్న వ్యక్తి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తన ఇంటి యజమానురాలు అనుమతి లేకుండా తన రూమ్‌‌లోకి ప్రవేశించిందని, గ్రిల్‌ నుంచి ఆహారాన్ని తోసేసిందని తెలిపాడు. అయితే, ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

​ఏం జరిగిందంటే?

రాజ్‌ తివానా అనే భారత సంతతి మహిళ కెనడాలోని సర్రే ప్రాంతంలో నివసిస్తున్నారు. అదే ఇంటిలో అద్దెకుంటున్న వ్యక్తి తన స్నేహితుడితో కలిసి తోటలో బార్బెక్యూపై వంట చేసుకుంటుండగా వివాదం మొదలైంది. తన ఇంటి దగ్గర బీఫ్‌ ‌వంట చేయొద్దంటూ రాజ్‌ ‌తివానా గందరగోళం చేసింది. గ్రిల్‌‌పై ఉన్న ఆహారాన్ని చెక్కతో కింద పడేయడానికి యత్నించింది. దీంతో అద్దెకున్న వ్యక్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అది నేను తినే ఫుడ్‌ ఎందుకు తొలగిస్తున్నారంటూ ప్రశ్నించాడు. అయినా మాట వినకుండా రాజ్‌ ‌తివానా ఆ వ్యక్తిని అడ్డుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఈ సంఘటన మొదటిది కాదని, ఆమె పదే పదే తనను ఇంట్లోకి ప్రవేశించనీయకుండా ఆటంకం పరిచిందని, తాళాలు మార్చేసిందని తెలిపాడు. అంతేకాకుండా తనపై రాళ్లదాడి చేసిందని కూడా ఆరోపించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన కెనడా పోలీసులు ఆమె వద్ద నుండి ఫోన్‌‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కెనడా చట్టాల ప్రకారం అద్దెదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రైవసీకి భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఆ దేశ చట్టాలను ఉల్లంఘించి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకే ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్