సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దీప్కే తండ్రి ఆదాయ వివరాలపై విచారణ జరపండి

1 రోజు క్రితం

bhijit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 10:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆర్‌టిఐ కార్యకర్త ఫిర్యాదు

న్యూఢిల్లీ : దేశంలో పేపర్‌ లీకేజిలపై పోరాడుతున్న సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై కక్ష‍సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. అభిజిత్‌ దీప్కే తండ్రి భగవాన్‌రావు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన జీతం రూ.65,000 లోపు ఉన్నప్పుడు అమెరికాలో కుమారుడిని ఎలా చదివించగలిగారో విచారణ జరపాలని మహారాష్ట ప్రభుత్వాన్ని కోరినట్లు సూరత్‌కు చెందిన ఆర్‌టిఐ కార్యకర్త అమిత్ తివారీ తెలిపారు. "ఒకవేళ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారమైతే కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం" అని చెప్పారు. పోలీసు కేసులను ఎదుర్కొంటున్న సిజెపి నిరసనకారులకు న్యాయ సహాయం చేసేందుకు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన న్యాయపరమైన రక్షణ నిధి (లీగల్ డిఫెన్స్ ఫండ్) విషయంలో భారత ఎన్నికల సంఘం, సెంట్రల్ జిఎస్‌టికి లేఖ రాసినట్లు కూడా తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్