సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇది పోలీస్ రాజ్యమా? : సిపిఎం ఎంపి రహీం

05 ఆగస్టు, 2026

aarahim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 11:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యార్థులపై ఎకె-47లు, పెల్లెట్ గన్‌లను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని పోలీస్ రాజ్యంగా మారుస్తోందని సిపిఎం ఎంపి ఎఎ రహీం విమ‌ర్శించారు. బుధ‌వారం రాజ్య‌స‌భ‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లుపై జరిగిన చర్చలో సిపిఎం త‌ర‌పున ఆయ‌న మాట్లాడారు. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉంటేనే న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించి వాటన్నిటినీ నాశనం చేసి, భారతదేశాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇటువంటి చర్యలను ఆపి, దేశంలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్